ఎలమంచిలి వాగ్దేవి ఇంటర్ కాలేజీలో ‘అభయ’ అవగాహన సదస్సు

ఎలమంచిలి వాగ్దేవి ఇంటర్ కాలేజీలో ‘అభయ’ అవగాహన సదస్సు

16/July/2026 19:15    Share:   

ఎలమంచిలి:
మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అభయ’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక వాగ్దేవి ఇంటర్మీడియట్ కాలేజీలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎలమంచిలి టౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థినులు సమాజంలో తమకు ఎదురయ్యే వేధింపులు, రక్షణ సమస్యలపై ఎలా స్పందించాలో వివరించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందంతో పాటు సుమారు 200 మంది విద్యార్థినులు చురుగ్గా పాల్గొన్నారు. ‘అభయ’ వంటి కార్యక్రమాలు మహిళల్లో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని కాలేజీ యాజమాన్యం ఈ సందర్భంగా కొనియాడింది.
Breaking News

Subscribe our Newsletter