యలమంచిలి : మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్డీఏ కూటమి (బీజేపీ) అభ్యర్థి పిల్లా రమాకుమారి 3,805 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి, వరుసగా మూడోసారి చైర్‌పర్సన్‌గా ఎన్నికై అరుదైన హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా గాజువాకలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా శ్రీనివాసరావుని శాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రజల విశ్వాసం, కార్యకర్తల కృషి, నాయకుల సహకారంతో సాధించిన ఈ విజయం యలమంచిలి రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక మైలురాయి. భవిష్యత్తులో మరింత అంకితభావంతో ప్రజాసేవ చేస్తూ, యలమంచిలి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.