రాంబిల్లి మండలంలో ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా రైతులకు శిక్షణ,

రాంబిల్లి మండలంలో ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా రైతులకు శిక్షణ,

24/October/2026 18:48    Share:   

రాంబిల్లి: బిసిటి–కృషి విజ్ఞాన కేంద్రం, హరిపురం ఆధ్వర్యంలో రాంబిల్లి మండలంలోని దిమిలి మరియు కట్టుబోలు గ్రామాల్లో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు శిక్షణా కార్యక్రమం మరియు క్షేత్ర సందర్శనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నేల శాస్త్ర విభాగం శాస్త్రవేత్త బి. శ్రీహరి రావు, డా. డి. ఉమామహేశ్వరరావు సీనియర్ సైంటిస్ట్, డా. ఎన్. భారతి సైంటిస్ట్, RARS అనకాపల్లి పాల్గొని రైతులకు నేల ఆరోగ్య పరిరక్షణ, భూసార నిర్వహణ, నేల పరీక్షల ప్రాముఖ్యత, నేలలోని పోషకాల సమతుల్యత మరియు ఎరువుల సమర్థ వినియోగంపై అవగాహన కల్పించారు.

నేల సారాన్ని కాపాడుకోవడం, సేంద్రియ ఎరువుల వినియోగం పెంచడం, అవసరానికి అనుగుణంగా ఎరువులు వాడటం ద్వారా పంటల దిగుబడి మరియు నాణ్యతను మెరుగుపరచుకోవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో జి. దేముడు, AEO రాంబిల్లి, రాజ్ కుమార్, మేఘన VAAలు, రైతులు పాల్గొని శిక్షణ పొందారు మరియు క్షేత్ర సందర్శనలు చేశారు.

Breaking News

Subscribe our Newsletter