ఆర్ ఏ ఆర్ ఎస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ముకుందరావు.
అనకాపల్లి( ప్రకృతి న్యూస్ )
"మోహన్ రావు దంపతులను ఘనంగా సత్కరించిన వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది"
అనకాపల్లి తో అనుబంధం. పదవి విరమణ చేసిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మోహన్ రావుకు అనకాపల్లి తో అనుబంధం ఉంది. ఉద్యోగం వచ్చిన తొలినాళ్లలో కసింకోటలో అగ్రికల్చర్ ఆఫీసర్గ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగరీత్యా వేరువేరు ప్రదేశాల్లో బాధ్యతలు నిర్వహించిన ఆయన పదవి విరమణ సమయానికి కొద్ది సంవత్సరాలు ముందు అనకాపల్లిలో ఉన్నతాధికారిగా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా వ్యవసాయ అధికారిగా మూడు సంవత్సరాలు పాటు పని చేసిన మోహన్ రావు ఈ ప్రాంత రైతాంగానికి విశిష్ట సేవలందించారు. రైతు శిక్షణా కేంద్రం స్థానే ప్రభుత్వం కొత్తగా పేరు మార్చిన జిల్లా వనరుల కేంద్రం( డి ఆర్ సి ) కి బాధ్యతలు చేపట్టి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ హోదాలో పదవి విరమణ చేశారు.

వ్యవసాయ రంగానికి డి ఆర్ సి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బమ్మిడి మోహన్ రావు అందించిన సేవలు ప్రశంసనీయమైన వని ఆర్ ఏ ఆర్ ఎస్ ఏ డి ఆర్ డాక్టర్ ముకుందరావు అన్నారు. మోహన్ రావు పదవి విరమణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మోహన్ రావు రైతులకు ఉద్యోగ నిర్వహణలో ఎంతో మేలు చేశారని కొనియాడారు. ఆయన తనకు క్లాస్మేట్ అని చదువులో చదువులో ఎప్పుడు అందరికంటే ముందుండేవాడని ప్రశంసించారు. పదవీ విరమణ కార్యక్రమంలో స్నేహితుడిగా తాను పాల్గొనడం ఆనందదాయకమన్నారు. వ్యవసాయ శాఖ లో ఉత్తమ సేవలందించి మోహన్రావు రైతుల మన్ననలు పొందారని వ్యవసాయ శాఖకు ఆయన వన్నె తెచ్చారని ఏడీఆర్ ముకుందరావు ఆయన సేవలను ప్రశంసించారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారిని ఆశా దేవి మోహన్ రావు దంపతులను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ రావు కుమార్తె రోహిత్ సాయి మాట్లాడుతూ తాను, సోదరుడు ఉన్నత చదువులు చదవడానికి తమ కెరీర్ చక్కగా మలుచుకోవడానికి తన తండ్రి మోహన్ రావు మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. తమ తల్లిదండ్రులకు తాను కూతురుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు. అనంతరం మోహన్ రావు సంధ్యారాణిదంపతులను జిల్లా వనరుల కేంద్రం, వ్యవసాయ శాఖ, భూసార పరీక్షా కేంద్రం ఏడీఏలు, ఏవోలు ఘనంగా సత్కరించారు.
