అచ్చుతాపురం (సిపిఎం) ఎంపిటిసి అభ్యర్థిగా చేపల తాతయ్య
21/October/2026 19:46
Share:
అచ్చుతాపురం మండలంలో గల పూడిమడక టు ఎంపిటిసి స్థానానికి సిపిఎం పార్టీ అభ్యర్థిగా చేపల తాతయ్య నామినేషన్ వేసారు. మత్స్యకారుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న చేపల తాతయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శంకరరావు ,అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము, కర్రీ అప్పారావు, చేపల లక్ష్మి, దేవుడు పాల్గొన్నారు