
విజయవాడ, అక్టోబర్
ఆంధ్రప్రదేశ్‌లోని 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు గాను 87 మున్సిపాలిటీల్లో వార్డుల వారీ ఫోటో ఓటరు జాబితా ప్రచురణ ఇప్పటికే పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
కోర్టు కేసులు, ఇతర ఎన్నికల సంబంధిత సమస్యల కారణంగా మిగిలిన 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓటరు జాబితా ప్రచురణ పూర్తి కాలేదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎన్నికల అథారిటీ, కమిషనర్ & డైరెక్టర్ తన లేఖ (Lr.Roc.No.13021/207/2026/Elecs.I-3/2, తేదీ 14.10.2026) ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో మిగిలిన 19 మున్సిపాలిటీలకు కొత్త తేదీని ప్రకటించాలని కోరారు.
దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ZA, ఏపీ మున్సిపాలిటీస్ చట్టం 1965లోని సెక్షన్లు 10-A, 10-B, 11 మరియు ఏపీ మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు (ఓటరు జాబితా తయారీ, ప్రచురణ) నిబంధనలు 2001 ప్రకారం అధికారాలను వినియోగించుకుంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం నెం. 865/SEC-F2/2026, తేదీ 17.10.2026 ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది.
24.10.2026న ప్రచురణ:
మిగిలిన 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వార్డుల వారీ ఫోటో ఓటరు జాబితా ప్రచురణకు 24.10.2026 ను కొత్త తేదీగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయడానికి వీలుగా ఈ జాబితాను ఫారం-I నోటీసుతో కలిపి ప్రచురించనున్నారు.
01.01.2026 అర్హత తేదీ:
01.01.2026ను అర్హత తేదీగా పరిగణించి, తాజా అసెంబ్లీ ఓటరు జాబితా ఆధారంగా మున్సిపల్ కమిషనర్లు వార్డుల వారీ ఫోటో ఓటరు జాబితాను తయారు చేసి ప్రచురించాలని రూల్స్ 3, 5 ప్రకారం ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇంతకుముందు 87 మున్సిపాలిటీలకు జారీ చేసిన విధివిధానాలనే ఈ 19 మున్సిపాలిటీలకు కూడా పాటించాలని సూచించింది.
నోటిఫికేషన్ పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత, IAS (రిటైర్డ్) సంతకం చేశారు.
జాబితా ప్రచురణ కానున్న 19 మున్సిపాలిటీలు / నగర పంచాయతీలు: