అంగరంగ వైభవంగా దిమలి గ్రామంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు

అంగరంగ వైభవంగా దిమలి గ్రామంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు

18/October/2026 07:11    Share:   

శ్రీ వల్లభ నారాయణ స్వామి ఆలయంలో భవానీలకు భిక్ష, అంబలం పూజ.
యలమంచిలి 
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మండలంలోని దిమిలి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వల్లభ నారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలోని గాయత్రీ భవానీ పీఠంలో ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శనివారం మధ్యాహ్నం దీక్షాధారులైన భవానీలకు భిక్షా కార్యక్రమంతో పాటు ఆలయానికి విచ్చేసిన భక్తులకు భారీగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం వేళ భవానీ అంబలం పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ విశేష పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ పూజాధికాల్లో పరిసర గ్రామాల భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Breaking News

Subscribe our Newsletter