పెదపల్లి వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బొద్ధపు లలిత నామినేషన్..

పెదపల్లి వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బొద్ధపు లలిత నామినేషన్..

17/October/2026 19:57    Share:   

యలమంచిలి :
మున్సిపాలిటీ రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా పెదపల్లి వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బొద్ధపు లలిత నామినేషన్ దాఖలు చేశారు. పెద్దపల్లి వార్డు టిడిపి ప్రెసిడెంట్, మాజీ కో ఆప్షన్ సభ్యులు బొద్ధపు నాగేశ్వరరావు సతీమణి లలిత శనివారం గ్రామం నుంచి తమ అనుచర గణంతో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాసేవలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో బొద్ధపు అప్పారావు, కరణం వెంకటరావు, శ్రీను, నానాజీ, దంట్ల విజయ్ కుమార్, గొర్లె వాసు, గల్లా కన్నబాబు, జెర్రిపోతుల చిన్న, మామిడి గోవిందు లో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter