ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావుకు మహిళలు, స్థానిక నాయకుల వినతి
చీపురుపల్లి:
పట్టణంలోని మెట్టకాలనీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ పెద్ద సంఖ్యలో కాలనీ మహిళలు, స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదికగా ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావుకు వినతిపత్రం అందజేశారు. గత 20 ఏళ్లుగా కాలనీలో పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు జరగకపోవడంతో వీధి రహదారులు, డ్రైనేజీ కాలువలు, ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.
కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణ చర్యలు చేపట్టాలని, రహదారులు, డ్రైనేజీ నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికీ నూతన తాగునీటి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.50 లక్షల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. కాలనీ ప్రజల సమస్యలను పరిష్కరించి, మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సదుపాయాలు, సురక్షిత తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసునాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు రౌతు కామునాయుడు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గవిడి నాగరాజు, జనసేన ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు, మాజీ పట్టణ అధ్యక్షుడు రౌతు నారాయణరావు, కర్రోతు రమణ, కర్రోతు ప్రసాద్, రౌతు షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు.
అలాగే టీడీపీ నాయకులు వెంపడపు లక్ష్మునాయుడు, గవిడి కల్కి, అంబళ్ల ఆదినారాయణ, మొండేటి శ్రీనివాస్, బురాడ చిన్న, నిద్దన పైడిరాజు, శంకరపు సూర్యనారాయణతో పాటు పార్టీ కార్యకర్తలు, కాలనీ మహిళలు, యువకులు, పెద్దలు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ చీపురుపల్లి రిపోర్టర్ ఏ.ఎస్.ఎ