ఆధ్యాత్మికంగా ఏలూరును మరింత అభివృద్ది చేస్తాము..ఎమ్మెల్యే బడేటి చంటి !

ఆధ్యాత్మికంగా ఏలూరును మరింత అభివృద్ది చేస్తాము..ఎమ్మెల్యే బడేటి చంటి !

09/July/2026 19:56    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
ఆధ్యాత్మికంగా ఏలూరును మరింత అభివృద్ది చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే శిథిలావస్థకు చేరిన ప్రాచీన దేవాలయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తూ వస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఏలూరు పవర్‌ పేటలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి ఆలయం వద్ద నూతనంగా నిర్మించనున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మహా పూర్ణాహుతి క్రతువులో ఆయన పాల్గొని, అర్చకులు కందుకూరి ఫణి శ్రీనివాస సాయి శబరీష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఏళ్ళ చరిత్ర కలిగిన దేవాలయాల జీర్ణోద్దరణకు భక్తులంతా సమిష్టిగా పూనుకోవడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. దీనికి దాతల ప్రోత్సాహం కూడా ఎంతో స్ఫూర్తివంతమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా వాసుదేవాలయం అభివృద్ధికి, అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి ఉదారంగా విరాళాలు ప్రకటించిన దాతలను ఆయన అభినందించారు. ఏలూరు ప్రజాప్రతినిధిగా తనవంతుగా అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, ఆలయ చైర్మన్‌ జవ్వాజి రామ గోపాల్‌, కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్, తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇంచార్జ్ దాకారపు రాజేశ్వరరావు, నాయకులు నవుడూరి శ్రీనివాస్, జోగి శ్రీనివాస్, గుర్రం సాంబమూర్తి, శీర్ల వాసు, గంటా రాంబాబు తదితరులు పాల్గొన్నారు...
Breaking News

Subscribe our Newsletter