ఏలూరును సమస్యల రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే బడేటి చంటి.
03/July/2026 20:58
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
సమస్యల రహిత నియోజకవర్గంగా ఏలూరును తీర్చిదిద్దేందుకు అహర్నిశలు పాటుపడుతున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తిష్టవేసిన అనేక జఠిలమైన సమస్యలకు సైతం మునుపెన్నడూ లేని విధంగా శాశ్వత పరిష్కార మార్గాలు చూపుతూ ప్రజల్లో భరోసా నింపుతున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా సమస్యల స్వీకార కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇదేక్రమంలో కూటమి ప్రభుత్వాధినేతల ఆలోచనల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా ఎంతో స్ఫూర్తివంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి.. సమస్యలు స్వీకరించడం, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం, ఆయా సమస్యలన్నింటికీ తగు పరిష్కార మార్గాలు చూపుతూ ప్రజల్లో ధైర్యాన్ని నింపడంతో మరింత మంది ఆయన్ని కలిసి వినతులు అందించేందుకు ప్రత్యేక ఆసక్తిని కనపరుస్తున్నారు. ఈ శుక్రవారం కూడా ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. ఈ సందర్భంగా వారందరినీ నవ్వుతూ ఎంతో ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, వారి నుండి వినతులు, అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవ నిరంతరాయంగా కొనసాగాలనే ధ్యేయంతో కూటమి ప్రభుత్వం అనేక వినూత్న విధానాలను అవలంభిస్తూ వస్తోందన్నారు. దానిలో భాగంగానే ప్రతి శుక్రవారం ప్రజాప్రతినిధులు స్వయంగా వినతులు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టేలా స్ఫూర్తిని నింపారన్నారు. ఈ విషయంలో ప్రజల్లో భరోసాను, ధైర్యాన్ని నింపేలా బాధ్యతాయుతంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి చంటి,,, రానున్న రోజుల్లో పేదలకు మరిన్ని మేళ్ళు చేకూర్చనున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే టిడ్కో ఇళ్ళ నిమిత్తం గతంలో డిడిలు కట్టిన వారికి ఆ సొమ్ములను వెనక్కి చెల్లించే ప్రక్రియను కూడా ఎంతో సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపి మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు...