గిరిజన గ్రామాల రోడ్డు కోసం గుర్రాలపై గిరిజనుల నిరసన..

గిరిజన గ్రామాల రోడ్డు కోసం గుర్రాలపై గిరిజనుల నిరసన..

17/August/2026 09:22    Share:   

అనకాపల్లి: కొండ ప్రాంత గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రావికమతం, వి.మాడుగుల మండలాలకు చెందిన సుమారు 120 మంది కొండు గిరిజనులు గుర్రాలపై ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో రహదారి, వైద్యం, విద్య, అంగన్‌వాడీ కేంద్రం, ఆశా కార్యకర్త వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
కొండ ప్రాంతాల్లో సరైన రహదారి లేకపోవడంతో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లడం, విద్యార్థులు పాఠశాలలకు చేరుకోవడం, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడం ఇబ్బందిగా మారిందని గిరిజనులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని వారు కోరారు.
శ్రీనివాసరావు అప్పికొండ.జిల్లా ఇన్చార్జి,క్రైమ్ ఎనాలిసిస్,అనకాపల్లి.
Breaking News

Subscribe our Newsletter