
రిపోర్టర్ కన్నేపల్లి నాగ శ్రీనివాస శర్మ
అచ్యుతాపురం మండలంలోని చోడపల్లి పంచాయతీ పరిధిలో గల గ్రామ దేవత పరదేశమ్మ తల్లి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేయడంతో గ్రామ ప్రజలు, యువకులు, భక్తులు అడ్డుకున్నారు.అచ్యుతాపురం–అనకాపల్లి రోడ్డు విస్తీర్ణంలో భాగంగా గ్రామ దేవత పరదేశమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం అన్యాయమని భక్తులు, గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.దేవదేవశాఖ, ఆర్.ఎం.బి శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు గ్రామసభ నిర్వహించి గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తుల అభిప్రాయాలు స్వీకరించి ఒప్పందం ప్రకారం అమలు చేసిన తర్వాతే విగ్రహాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.పరదేశమ్మ విగ్రహం కోసం ముందుగా భూమిని కేటాయించాలని, కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాతే పాత విగ్రహాన్ని తొలగించాలని వారు కోరుతున్నారు.భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం గౌరవించి పాటించాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో కాకి శంకర్, కాకి అవతారం, పోలవరపు పారునాయుడు, దమ్ము చండి, గంజి రామకృష్ణ, పెంకి నరసింగరావు, గోవిందు లోవరాజు, నిర్వాసితులు, బాధితులు పాల్గొని పోరాటానికి సిఐటియు మండల కన్వీనర్ కూండ్రపు సోము నాయుడు మద్దతు ఇచ్చారు.