యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పిల్లా రమాకుమారి
17/October/2026 19:52
Share:
యలమంచిలి : పురపాలక సంఘం రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా మున్సిపల్ మాజీ చైర్మన్ పిల్లా రమాకుమారి నామినేషన్ దాఖలు చేశారు. కూటమి అభ్యర్థిగా రమా కుమారి (బిజెపి) ఆమె తన నామినేషన్ పత్రాలను మున్సిపల్ ఎన్నికల అధికారి కే వరహాలకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ తన తల్లి ఆశీర్వాదంతో నామినేషన్ దాఖలు చేశానన్నారు. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మున్సిపాలిటీలో మరొకసారి తనకు చైర్పర్సన్ గా అవకాశం కల్పించినట్లయితే మరింత అభివృద్ధి చేసి తీరుతానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్ల కొండబాబు తదితరులు పాల్గొన్నారు.