స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు..

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు..

15/August/2026 19:42    Share:   

పతాక ఆవిష్కరణతో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
నేటి (ఆగస్టు 15) 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో ఘనంగా పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కోర్టు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి పి విజయ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి జి స్పందన, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ కే రమేష్ తదితర న్యాయమూర్తులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.వి. రమణ, వైస్ ప్రెసిడెంట్ ఎల్.వి.ఆర్.కె, సెక్రటరీ సి.హెచ్. శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమ నిర్వహణలో సహకరించారు.
అలాగే ఏ.జీ.పీ. లు ధూల్ నూకరాజు, ఆర్. గోవిందరావు గార్లతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడిన న్యాయమూర్తులు, న్యాయవాదులు... దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, స్వేచ్ఛ, సమగ్రత, ఐక్యత మరియు బాధ్యత వంటి విలువలను ఎల్లప్పుడూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మరింత బలమైన, శాంతియుతమైన, సమైక్యమైన మరియు సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి మన వంతు కృషి చేద్దామని వారు ఆహ్వానించారు.
Breaking News

Subscribe our Newsletter