కార్మికులకు నష్టదాయకమైన లేబర్‌ కోడ్లకు నిరసనగా  బ్లాక్‌ డే

కార్మికులకు నష్టదాయకమైన లేబర్‌ కోడ్లకు నిరసనగా  బ్లాక్‌ డే

01/April/2026 15:13    Share:   

కార్మికులకు నష్టదాయకమైన నాలుగు లేబర్ కోడ్స్ నేటి నుండి అమలుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి అచ్చుతాపురంలో కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేసి బ్లాక్ డే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కే సోమనాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ నేటి నుంచి అమలకు పూనుకోవడం దుర్మార్గమని 36 కోట్ల మంది కార్మికులు ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె చేసినప్పటికీ లేబర్ కోడ్స్ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి అమలు చేయాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీనికి నిరసనగా కార్మికుల పనిచేసే ప్రాంతాల్లో బ్లాక్ బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి దీనిలో భాగంగా కార్మికులు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడడం తప్ప ఇంకొక మార్గం లేదని పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని కార్ల మార్క్స్ మహనీయుడు నినదించాడు ఈనాటి పాలకవర్గాలు కార్మికుల శ్రమను కార్పొరేట్లకు దోచుపెట్టడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్స్ అమలు చేస్తున్నది కార్మిక హక్కుల రక్షణ కోసం ఈ లేబర్ కోడ్స్ రద్దు అయ్యేంతవరకు కార్మిక వర్గం పోరాడాలని సిఐటియు పిలుపునిస్తున్నది. ఈ కార్యక్రమంలో రాజన్న అప్పలనాయుడు ,రమేష్ రాజు ,సురేష్ పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter