మాతృసంస్థలో ఘనంగా గ్రూప్-2 ఆఫీసర్ అత్తిలి శాంతిశ్రీ కి సత్కారం..

మాతృసంస్థలో ఘనంగా గ్రూప్-2 ఆఫీసర్ అత్తిలి శాంతిశ్రీ కి సత్కారం..

18/July/2026 21:31    Share:   

శ్రీ గౌరీ విద్యా నికేతన్ హైస్కూల్ నందు శనివారం ఒక ప్రతిభా పురస్కార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని, ప్రస్తుత విద్యాశాఖ గ్రూప్-2 అధికారిణి అయిన అత్తిలి శాంతిశ్రీని పాఠశాల మేనేజ్‌మెంట్ మరియు సిబ్బంది ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో శాంతిశ్రీ తల్లిదండ్రులు అత్తిలి నూకరాజు, సత్యవేణి, స్కూల్ ఫౌండర్ శ్రీమతి ఎస్. వి. లీలా కుమారి, డైరెక్టర్ బి. వి. ప్రసాదరావు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని ఆమెకు శాలువా కప్పి, మెమెంటోతో ఘన సత్కారం చేశారు.
గురువుల, తల్లిదండ్రుల కృషే నా విజయ రహస్యం: అత్తిలి శాంతిశ్రీ
ఈ సందర్భంగా గ్రూప్-2 ఆఫీసర్ అత్తిలి శాంతిశ్రీ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు ఎల్.కే.జీ (LKG) నుండి 10వ తరగతి వరకు క్రమశిక్షణతో కూడిన విద్యాబుద్ధులు నేర్పిన శ్రీ గౌరీ విద్యా నికేతన్ యాజమాన్యానికి, గురువులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొదటి ప్రయత్నంలోనే తాను గ్రూప్-2 ఆఫీసర్‌గా ఎంపికవడానికి తన తల్లిదండ్రులు చేసిన కృషి, పడ్డ కష్టం మరువలేనిదని కొనియాడారు.ప్రస్తుతం తాను అమరావతిలోని స్కూల్ సెకండరీ ఎడ్యుకేషన్ విభాగంలో ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తాను చదువుకుని ఎదిగిన మాతృసంస్థలోనే ఈ రోజు ఇంతటి ఘన సత్కారం జరగడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకమని శాంతిశ్రీ ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్కూల్ యాజమాన్యం ఆకాంక్షించింది.
Breaking News

Subscribe our Newsletter