స్థానిక ఎన్నికలకు జనసైనికులు, జనసేన శ్రేణులు సిద్ధం కావాలి..

స్థానిక ఎన్నికలకు జనసైనికులు, జనసేన శ్రేణులు సిద్ధం కావాలి..

23/August/2026 21:05    Share:   

* ప్రజల పక్షాన పోరాటమే జనసేన సిద్ధాంతమని వెల్లడి..
* స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి..
* ఈనెల 25వ తేదీ నుండి 30 వ తేదీ వరకు కార్పోరేటర్ అభ్యర్థుల అప్లికేషన్ స్వీకరణ..
* ఏపీఎస్ఆర్టీసీ జోన్ 2 చైర్మన్, ఏలూరు జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు..

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. జనసేన పార్టీకి జనసైనికులు వీర మహిళలే అసలైన బలమని, వారి అంకిత భావంతోనే పార్టీ బలోపేతం అవుతుంది అన్నారు. ఆదివారం ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో సమన్వయంతో పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. జన సైనికుల అభిమతం కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగానే జనసేన పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల సమస్యలపై పోరాడే తత్వం జనసేన పార్టీ ప్రత్యేకత అని రెడ్డి అప్పలనాయుడు అన్నారు.  ప్రజల కోసం నిబద్దతతో పనిచేయడం, క్రమశిక్షణతో వ్యవహరించడం, పోరాట స్ఫూర్తిని కలిగి ఉండడం వంటి విలువలను పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటి నుంచే జనసైనికులు వీర మహిళలకు నేర్పారని తెలిపారు. పార్టీ కార్యకర్తలు వీర మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక వ్యవస్థను రానున్న రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ సంకల్పించారని, ఆయన వెల్లడించారు.. జనసేనలో కష్టపడి పని చేసే కార్యకర్తలకి ఎప్పటికీ ప్రాధాన్యం, గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఏలూరులో 50 డివిజన్లోనూ జనసేన పార్టీ బలంగా ఉందన్నారు. జనసేన నాయకులు కార్యకర్తలను ఈ విధంగా సమయపరుస్తున్నామన్నారు.. 5, 10 రోజుల సమయాన్ని వారికి కేటాయించామని, ఏలూరులో జనసేన పార్టీ నుండి కార్పోరేటర్ అభ్యర్థిగా పోటీ చేయబోయే వారికోసం అప్లికేషన్ స్వీకరించుటకు ఐదుగురితో కూడిన కమిటీని నియమించామని, ఈ కమిటీలో జనసేన నాయకులు రాఘవయ్య చౌదరి గారు, శిరిపల్లి ప్రసాద్ గారు, నిమ్మల జ్యోతి కుమార్ గారు, కస్తూరి సాయి తేజస్విని గారు, ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా గారు అప్లికేషన్లు స్వీకరిస్తారు.. వీరు ఆ అప్లికేషన్లు పరిశీలించి వారి యొక్క సామర్థ్యం, అక్కడ ఉన్న కమ్యూనిటీ, నాయకత్వ పటిమ అన్నింటిని పరిగణలోకి తీసుకొని జనసేన పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంటారన్నారు. ఈనెల 25వ తేదీ నుండి 30 వ తేదీ వరకు కార్పోరేటర్ అభ్యర్థులు తమ అప్లికేషన్లు పార్టీ కార్యాలయం నందు సమర్పించాలని అన్నారు. అన్ని స్థానిక సంస్థల్లోనూ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. రానున్న మూడు సంవత్సరాల కాలంలో , ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా, స్థానిక సంస్థలు బలపడే విధంగా, జనసేన శ్రేణులు అందరూ కలిసికట్టుగా కూటమికి మద్దతుగా నిలవాలన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో, పార్టీ అభివృద్ధి విస్తరణ దిశగా ఏలూరులో త్వరలోనే పలు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకు జనసైనికులు, వీర మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు..  ఏలూరు నగరంలోని 50 డివిజన్ లో పోటీ చేసే స్థాయికి పార్టీని బలోపేతం చేయాలనే, జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్డీఏ కూటమి పట్ల అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నారాశేషు గారు, జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి గారు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ గారు, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు గారు, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్ గారు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్ గారు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా గారు, నగర అధ్యక్షులు వీరంకిపండు గారు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశి నరేష్ గారు, కార్పోరేటర్లు పొలిమేర దాసు గారు, కోయ సత్తిబాబు గారు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ క్లస్టర్ ఇంచార్జీలు, డివిజన్ ఇంచార్జీలు, నగర కమిటీ సభ్యులు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter