
బొబ్బిలి |
మున్సిపల్ చైర్మన్ పీఠానికి కూటమి అభ్యర్థిగా శ్రీమతి రాంబర్కి స్వప్న శనివారం ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు.గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన) గారు, బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారితో కలిసి ముందుగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రౌతు రామ్మూర్తి గారు, బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెంట స్వామినాయుడు గారు, మాజీ చైర్మన్ రాంబర్కి శరత్ గారు, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సుంకరి సాయిరమేష్ గారు, బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల శ్రీనివాసరావు గారు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Mandhapati Surya Narayana Raju