యలమంచిలి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా నాగుమంత్రి శాంతి ఎంపిక..

యలమంచిలి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా నాగుమంత్రి శాంతి ఎంపిక..

16/October/2026 19:44    Share:   

​యలమంచిలి :
రాబోయే యలమంచిలి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా స్థానిక నాయకురాలు నాగుమంత్రి శాంతిని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. ​కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీఏసీ సభ్యుడు ఎం. పల్లంరాజు, జిల్లా ఇన్ఛార్జ్ జీవీవీ కమలాకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్ ఆశీస్సులతో ఆమెను ఈ స్థానానికి ఎంపిక చేశారు. ​మహిళా కాంగ్రెస్ నాయకురాలిగా మొదటి నుంచి పార్టీ బలోపేతానికి, వివిధ ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న శాంతికి ఛైర్‌పర్సన్ అభ్యర్థిత్వ బాధ్యతలను అప్పగించడంపై పార్టీ శ్రేణులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.
Breaking News

Subscribe our Newsletter