పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఏలూరులో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు
12/July/2026 20:34
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా అందరీ ఆరాధ్య నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నిన్నటి రోజున కుడి భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఆయన త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు గారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదివారం ఏలూరు ఆర్. ఆర్. పేటలో కొలువైఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో ప్రత్యేక పూజలు, అర్చనలు, నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ప్రజా సేవకులు మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అహర్నిశలు ప్రజల పక్షాన నిలబడే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరం అన్నారు. ఆయన సంకల్ప బలం, పోరాట పటిమ ముందు ఎలాంటి అనారోగ్యమైనా తలవంచాల్సిందే అన్నారు. దశాబ్ద కాలానికి పైగా తీవ్రమైన భుజ నొప్పిని భరిస్తూనే ప్రజాసేవను, జనసేన సిధ్ధాంతాల సాధనను తన ధ్యేయంగా కొనసాగించిన పవన్ కళ్యాణ్ గారి అంకితభావం ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయం అన్నారు.. శస్త్రచికిత్స నుండి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, మునుపటి కన్నా రెట్టింపు ఉత్సాహంతో, నూతనోత్తేజంతో తిరిగి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాలని కోట్లాది మంది అభిమానులు, జనసైనికులు మరియు ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని అన్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ మార్కండేయ స్వామి, శ్రీ ఓంకార విశ్వేశ్వర స్వామి, శ్రీశఅయ్యప్ప స్వామి, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి, శ్రీ వల్లీదేవ సేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు, సర్వ దేవతల ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ శ్రీరామ రక్షగా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ బొత్స మధు, నగర అధ్యక్షులు వీరంకి పండు, సీనియర్ నాయకులు రెడ్డి గౌరీ శంకర్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు..