క్యూఆర్ కోడ్ గడువు పొడిగించాలని కోరుతూ తాసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన రేషన్ డీలర్లు
14/October/2026 06:22
Share:
యలమంచిలి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో ఇటీవల ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ విధానం అమలు గడువును పొడిగించాలని కోరుతూ యలమంచిలి మండల రేషన్ డీలర్లు మంగళవారం స్థానిక తాసిల్దార్ కె. వరహాలరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీలర్లు మాట్లాడుతూ.. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన క్యూఆర్ కోడ్ విధానం, బయోమెట్రిక్ సాంకేతిక సమస్యల వల్ల క్షేత్రస్థాయిలో రేషన్ పంపిణీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తాసిల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. సాంకేతిక లోపాలు సరిదిద్దే వరకు ఈ విధానానికి సమయం పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, పంపిణీ సమయంలో పలుచోట్ల డీలర్లపై జరుగుతున్న దాడులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న కోటా డీలర్లకు తగిన భద్రత కల్పించాలని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాసిల్దార్తో పాటు ఇతర అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రేషన్ డీలర్లు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.