దివంగత హోం గార్డు కుటుంబానికి రూ.3.7 లక్షల ఆర్థిక సాయం
12/October/2026 21:42
Share:
అనకాపల్లి, అక్టోబర్ 12: విధులపట్ల నిబద్ధతతో ఉంటూ, అనారోగ్యంతో అకాల మరణం చెందిన హోం గార్డు కూరాడ రమణ కుటుంబాన్ని ఉమ్మడి జిల్లా పోలీసులు అండగా నిలిచి ఆదుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ మరణించిన రమణ కుటుంబానికి, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు సోమవారం తన కార్యాలయంలో రూ.3,71,332/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు.సహృదయంతో స్పందించిన తోటి హోం గార్డులు ఈ ఆర్థిక సాయం వెనుక అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల హోం గార్డుల సామాజిక స్పృహ ఉంది. తమ తోటి ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో:ఉభయ జిల్లాల హోం గార్డులు తమ ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను స్వచ్ఛందంగా విరాళంగా ప్రకటించారు.ఇతర రూపాల్లో సేకరించిన నిధులతో కలిపి మొత్తం రూ.3,71,332/- మొత్తాన్ని సమకూర్చారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ దేవరాజు, జూనియర్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.