మహిళా ఉపాధ్యాయురాలిని వేధించిన హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలి..

మహిళా ఉపాధ్యాయురాలిని వేధించిన హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలి..

09/October/2026 20:24    Share:   

విచారణ నివేదికపై చర్యలు ఏవీ? డీఈఓకు యూటీఎఫ్‌ నేతల ధర్నా నోటీసు

అనకాపల్లి, అక్టోబర్ 9:

మహిళా ఉపాధ్యాయురాలిని వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కూండ్రం జడ్పీ హైస్కూల్‌ ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి జి.జి.ఎస్‌. నాగేశ్వరరావును కలిసి ధర్నా నోటీసు అందజేశారు.
ఈ సందర్భంగా యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ, కూండ్రం జడ్పీ హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఎస్‌. సుజాత, అదే పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు ఎన్‌. సన్యాసినాయుడిపై 2026 మార్చి 18న జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ ఫిర్యాదుపై ఆగస్టు 17న విచారణ కమిటీని నియమించి విచారణ చేపట్టినప్పటికీ, ఇప్పటివరకు విచారణ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. మహిళా ఉపాధ్యాయురాలి ఫిర్యాదుపై అధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.విచారణ నివేదిక ఆధారంగా సంబంధిత ప్రధానోపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని గొంది చిన్నబ్బాయి హెచ్చరించారు. అవసరమైతే ధర్నా చేపట్టి నిరసన తెలియజేస్తామని డీఈఓకు స్పష్టం చేసినట్లు తెలిపారు.దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి జి.జి.ఎస్‌. నాగేశ్వరరావు స్పందిస్తూ, విచారణ నివేదిక ఆధారంగా త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు యూటీఎఫ్‌ నాయకులు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter