మార్చి 14వ తేదీని ప్రపంచవ్యాప్తంగా 'పై (π)' గా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.
15/March/2026 10:42
Share:
గణిత ప్రపంచంలో అత్యంత కీలకమైన 'పై (π)' గురించి మనందరికీ తెలిసిందే. ఈ రోజు మార్చి 14వ తేదీని ప్రపంచవ్యాప్తంగా 'పై డే' గా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. క్రైమ్ అనాలసిస్ A. Srinivasa Rao,అనకాపల్లి.జిల్లా ఇన్చార్జి, గణితంలో 'పై' విలువ సుమారుగా 3.14 ఉంటుంది. అందుకే, ఆ సంఖ్యను సూచించేలా మూడవ నెల 14వ తేదీని (3/14) 'పై డే' గా ఎంచుకున్నారు. విశేషమేమిటంటే, భౌతిక శాస్త్ర దిగ్గజం ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుట్టినరోజు కూడా ఈ రోజే కావడం ఈ దినోత్సవానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చింది. ఈ రోజున గణిత ప్రియులు 'పై' విలువలోని అనంతమైన దశాంశ అంకెలను కంఠస్థం చేస్తూ, పోటీలు నిర్వహించుకుంటారు. అనకాపల్లితో సహా రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న పలు పాఠశాలలు, కళాశాలల్లో గోడల పైన 'పై' అంకెలను పొడవుగా రాసి ప్రదర్శించడం ద్వారా విద్యార్థులు ఈ రోజును వినూత్నంగా జరుపుకుంటున్నారు. చరిత్రలోకి వెళితే... క్రీస్తుపూర్వం 287–212 కాలంలో గ్రీకు గణిత శాస్త్రవేత్త ఆర్కిమెడిస్ వృత్తం లోపల, వెలుపల బహుభుజులను గీయడం ద్వారా 'పై' విలువను శాస్త్రీయంగా 3.14 గా అంచనా వేశారు. ఆ తర్వాత సా.శ. 499లో మన భారతీయ మహా గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట తన 'ఆర్యభట్టీయం' గ్రంథంలో దీనికి అత్యంత కచ్చితమైన విలువను 3.1416 గా లెక్కకట్టారు. ఆనాటి కాలానికి ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ. 3.14159265358... ఇలా అంతులేకుండా సాగిపోయే ఈ 'పై' విలువ, విశ్వం యొక్క ఎన్నో రహస్యాలను ఛేదించడంలో నేటికీ కీలకంగానే ఉంది.