కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. దీనిలో భాగంగానే ప్రజా సమస్యలకు కూడా సత్వర పరిష్కారాలు చూపుతూ ముందుకెళ్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన,,, తనను కలిసేందుకు విచ్చేసిన వారిని ఆత్మీయంగా పలకరించారు. వారి నుండి వినతులు స్వీకరించారు. సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చునని ఆయన భరోసా కల్పించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...