ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సహకారంతో శ్రీ నూకాంబిక ఆలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.

ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సహకారంతో శ్రీ నూకాంబిక ఆలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.

11/March/2026 19:38    Share:   

ఈ నెల 17 నుంచి కొత్త అమావాస్య జాతర ప్రారంభం. ఆలయ చైర్మన్ పీల నాగ శ్రీను (గొల్ల బాబు)
అనకాపల్లి (ప్రకృతి వ్యవసాయం)
శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం అభివృద్ధి చేయడానికి స్థానిక శాసనసభ్యులు,మాజీ మంత్రివర్యులు కొణతాల రామకృష్ణ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు ఆలయ చైర్మన్ పీల నాగ శ్రీను( గొల్ల బాబు )వెల్లడించారు. ఆలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు ప్రత్యేకంగా మూడు  టీం లను నియమించిందని ఇందులో భాగంగా ఒక టీం త్రనూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారని ఆయన తెలిపారు.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో 2005 లో సింహాచలం ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగిందని అన్నారు. ఆ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టవలసి ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఈ విధంగానే అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయంలో నిర్మాణాలు చేపడతారని ఆయన తెలిపారు.అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఈ నెల 18న అమ్మవారికి పట్టు వస్త్రాలుసమర్పిస్తారని అన్నారు
సుమారు 12 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి..
అమ్మవారి ఆలయాన్ని 11 కోట్ల 93 లక్షల రూపాయల వ్యయంతో పునర్నిర్మించినట్టు చైర్మన్ నాగశ్రీను తెలిపారు.పీలా గోవింద సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నసమయంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో వంద అడుగుల రాజగోపురం నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో ఆలయంలోపల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారని ఈ నిర్మాణం భాగస్వామ్యులైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక అసంపూర్తిగా ఉన్న ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేశామన్నారు. గత పాలకవర్గంలో ఫిక్స్డ్ డిపాజిట్లను డ్రా చేసి వాడినందున డిపాజిట్లు తగ్గిపోయాయని, తాము అలా కాకుండా ఎమ్మెల్యే కొణతాల సహకారంతో డోనరులు,భక్తుల ద్వారా ఆలయ అభివృద్ధికి కావలసిన నిధులను సమకూరుస్తున్నామని తెలిపారు.ఈ నిర్మాణంలో సహకరించిన డోనర్లకు,భక్తులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అందులో ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారని అయితే ఈ నిధులను అమ్మవారి ఆలయానికి ఇవ్వకూడదని ఆశ్రయించడంతో కేసు కోర్టులో నడుస్తుందని తెలిపారు. దేవాదాయ శాఖకమిషనర్, ఆలయ ఈవో పేరిట ఈ ఐదు కోట్ల రూపాయలు నిధులను డిపాజిట్ చేస్తే ఇప్పటికీ ఏడు కోట్ల రూపాయలు అయిందని చైర్మన్ నాగ శ్రీను వెల్లడించారు ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించిన ఎంపీ, సీఎం రమేష్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు, బుద్ధ నాగ జగదీశ్వరరావు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, గవరకార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈనెల 17 నుంచి నెలరోజుల పాటు అమ్మవారి పండుగ....
శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవం ఈ నెల 17 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 17 వరకు నెల రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తామని చైర్మన్ నాగ శ్రీను తెలిపారు.
సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి యాళ్ల శ్రీధర్ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆలోచనలతోనే ఆలయ అభివృద్ధి జరుగుతుందని జాతరను ఘనంగా నిర్వహించడానికి పాలకవర్గం కృషి చేస్తుందని అన్నారు. దేవాదాయ ధర్మాదాయ అనకాపల్లి జిల్లా అధికారి సుధారాణి మాట్లాడుతూ అమ్మవారి పండగకు అందరూ సహకరించి మంచి పేరు తీసుకురావాలన్నారు.విలేకరుల సమావేశంలో ధర్మకర్తలు మారిశెట్టి శంకర్రావు, సూరే సతీష్ కుమార్,దాడి రవికుమార్ కొడుకుల శ్రీకాంత్ కాండ్రీలు రాజారావు పోలిమేర స్వాతి ఆనంద్ కుమార్ వడ్డాది మంగ మద్ది జానకి శ్రీనివాస్ ఎర్రవరపు సంతోష్ కుమార్ నాగేష్ కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. 
Breaking News

Subscribe our Newsletter