ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
యలమంచిలి :
- ప్రతి ఇంటా సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం యలమంచిలి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని ఉపయోగించుకుని ఇళ్లపై సౌర విద్యుత్ పలకలను అమర్చుకోవడం ద్వారా ఉచిత విద్యుత్‌తో పాటు కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలపై నియోజకవర్గ ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సేవలు అందేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శ్రీను, కర్రీ ఝాన్సీ, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, గోపి, నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ శాఖ అధికారులు, పాల్గొన్నారు.
-రు.