గొరపూడిలో రైతు మృతి..!భూసేకరణపై సమగ్ర విచారణ జరపాలి..!!

గొరపూడిలో రైతు మృతి..!భూసేకరణపై సమగ్ర విచారణ జరపాలి..!!

03/October/2026 21:04    Share:   

రైతుల ఆందోళనకు పరిష్కారం చూపాలి.. న్యాయమైన పరిహారం అందించాలి...!!!

క్రైమ్ అనాలసిస్ | టీవీఎస్ ప్రకాష్ (స్పెషల్ రిపోర్టర్)

గొరపూడిలో భూసేకరణకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో రైతు లాలం నరసింహారావు మృతి చెందడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. భూసేకరణ సమయంలో అధికారుల చర్యలు, పోలీసుల మోహరింపు, రైతుల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని బాధిత రైతులు కోరుతున్నారు.

భూసేకరణకు సంబంధించి 2018లో జారీ చేసిన అవార్డులపై రైతులు న్యాయపోరాటం చేస్తున్న నేపథ్యంలో, వారికి చట్టబద్ధమైన పరిహారం, పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇద్దరు ఆడపిల్లలు, భార్య ఉన్న నరసింహారావు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, ఆయన మృతికి దారితీసిన పరిస్థితులపై స్వతంత్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే రైతుల హక్కులను కాపాడుతూ న్యాయబద్ధంగా భూసేకరణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
Breaking News

Subscribe our Newsletter