వైభవంగా స్వామివారి దర్శనాలు, ఉట్టి మహోత్సవం..

వైభవంగా స్వామివారి దర్శనాలు, ఉట్టి మహోత్సవం..

04/September/2026 21:31    Share:   

యలమంచిలి : పట్టణంలోని ఎర్రవరంలో ​కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణుని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే యాదవ సోదరులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆలయాన్ని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ​పండుగను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన సాంప్రదాయ ఉట్టి కొట్టే మహోత్సవంలో యువకులు, భక్తులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ​ఈ వేడుకల్లో బోదేపు గోవింద్, గుప్తా, అధ్యక్షులు దూళి అప్పల చిట్టి, ఉపాధ్యక్షులు కిల్లాడి సత్యనారాయణ, సబ్బు రమణ, సొరంగి చిన్న, పూర్వ కౌన్సిలర్లు పిట్టా సత్తిబాబు, సియాద్రి శ్రీనివాసరావు, పిట్టా శ్రీను, సొరంగి చిన్న తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
Breaking News

Subscribe our Newsletter