# YSRCP ధర్నా: DSSC అక్రమాలపై సీబీఐ విచారణకు  డిమాండ్..

# YSRCP ధర్నా: DSSC అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్..

07/August/2026 15:13    Share:   

డీఎస్సీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటం*అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త గౌ.శ్రీ. మలసాల భరత కుమార్ ఆధ్వర్యంలో రెండోవ రోజు రిలే నిరాహార దీక్షలు# YSRCP ధర్నా: DSSC అక్రమాలపై సీబీఐ విచారణ డిమాండ్ - లోకేష్ రాజీనామా వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక.

క్రైమ్ అనాలసిస్ ప్రతినిధి పీలా శ్రీనివాసరావు 

రాష్ట్రంలో DSSC నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరాహార దీక్ష రెండవ రోజు అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్లో ఘనంగా జరిగింది. అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షకు పలువురు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీగా హాజరై సంఘీభావం తెలిపారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, అనకాపల్లి సమన్వయకర్త నియోజకవర్గ పరిశీలకులు, విద్యార్థులు, యువత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 లక్షలకు పైగా నిరుద్యోగులు DSSC పరీక్షలు రాయగా, ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వం GOలు మార్చి, ఫలితాల చార్టును సవరించి, కొత్తగా స్పోర్ట్స్ కోటాను తీసుకువచ్చి DSSC ఉద్యోగాలను విక్రయించిందని ఆరోపించారు.
"ఈ రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా నిరుద్యోగులు డీఎస్సీ పరీక్షలు రాస్తే ఫలితాలు వచ్చిన తర్వాత GOలు మార్చి, ఫలితాల చార్టు మార్చి కొత్తగా స్పోర్ట్స్ కోటా తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం డీఎస్సీ ఉద్యోగాలను అమ్ముకుంది" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.దగాపడ్డ ప్రతి DSSC అభ్యర్థుల తరపున, ఫీజు చెల్లించలేని విద్యార్థుల తరపున పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాటం కొనసాగుతుందని, ముఖ్యంగా DSSCలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదని భరత్ కుమార్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, విద్యార్థి విభాగం, యువజన విభాగం అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.82వ వార్డు ఇన్చార్జ్ మందపాటి జానకిరామరాజు, 83వ వార్డ్ ఇన్చార్జ్ జాజుల రమేష్, 81వ వార్డు ఇన్చార్జ్ కె.ఎం. నాయుడు, 80వ వార్డు ఇన్చార్జ్ శివ కె.ఎం. నాయుడు, దొంతులూరు దిలీప్ కుమార్, వేగి త్రినాధ్, మండల అధ్యక్షులు, మాజీ మండలాధ్యక్షుడు గొర్లి సూరిబాబు, రాష్ట్ర నాయకులు ఉగ్గిన అప్పారావు, పెంటకోట శ్రీనివాసరావు, నూకాంబికా ట్రస్ట్ బోర్డ్ మాజీ డైరెక్టర్ పీలా శ్రీనివాసరావు, ముఖంపిగా ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ ఆడారి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వంపై తమ ఆందోళనను నమోదు చేస్తూ, DSSC అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యువత, నిరుద్యోగులతో కలిసి ఈ నిరాహార దీక్ష కొనసాగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని వైఎస్సార్ సీపీ నేతలు హెచ్చరించారు.
Breaking News

Subscribe our Newsletter