యలమంచిలిలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహణ..!!

యలమంచిలిలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహణ..!!

19/April/2026 07:00    Share:   

క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి :
2026 జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఐదవ రోజు శనివారం యలమంచిలిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మై హోమ్ ఇండస్ట్రీలో సిబ్బందికి ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం గురించి వివరించారు.అలాగే కొక్కిరాపల్లి లోని రవిశంకర్ పెట్రోల్ బంక్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించి, వివిధ రకాల అగ్ని ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో ప్రదర్శించారు. ఈ డ్రిల్ ద్వారా సిబ్బందికి ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించారు.ఈ కార్యక్రమాల్లో యలమంచిలి అగ్నిమాపక అధికారి డి. రాంబాబు మరియు సిబ్బంది పాల్గొని ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
Breaking News

Subscribe our Newsletter