ప్రజా సేవే లక్ష్యంగా చెత్త, మట్టి, చెట్ల వ్యర్థాలను తొలగించిన మెట్టకోలని వాసులు..

ప్రజా సేవే లక్ష్యంగా చెత్త, మట్టి, చెట్ల వ్యర్థాలను తొలగించిన మెట్టకోలని వాసులు..

07/October/2026 21:53    Share:   

చీపురుపల్లి:

పట్టణంలోని మెట్టకోలని ప్రాంతంలో చాలా రోజులుగా రహదారులకు ఇరువైపులా చెత్త, మట్టి, చెట్ల కొమ్మలు పేరుకుపోయి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న సమస్యకు పరిష్కారం లభించింది. స్థానిక ప్రజలు, యువత, మహిళలు సమస్యను టీడీపీ, జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.
చీపురుపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు సహాయ సహకారాలతో జడ్పీటీసీ ప్రతినిధి వల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు రౌతు కాము నాయుడు, పట్టణ అధ్యక్షుడు గవిడి నాగరాజు, జనసేన ఇంచార్జి విసినిగిరి శ్రీనివాసరావు, రౌతు నారాయణరావు తదితరులు సమస్యపై స్పందించారు.
“ప్రజా సమస్యే మా సమస్య” అనే ఉద్దేశంతో పంచాయతీ సిబ్బందితో మాట్లాడి, నాయకుల ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో రహదారులకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త, మట్టి, చెట్ల వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రౌతు పైడిరాజు, కర్రోతు రమణ, రౌతు షణ్ముఖరావు, కర్రోతు ప్రసాద్, అంబల్ల ఆదినారాయణ, ఇల్లపు ఆదితో పాటు కార్యకర్తలు రౌతు కనకరాజు, పిన్నింటి వివేక్, చిలుకూరు శేఖర్, నిద్ధాన పైడిరాజు, బూరాడ చిన్న, పండు, కోల రాము, వెంకీ, రౌతు వెంకటేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మహిళలు, యువకులు, పెద్దలు కూడా శుభ్రత కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.ప్రజా సేవే లక్ష్యం.. పరిశుభ్రతే మన బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు.

క్రైమ్ ఎనాలసిస్ చీపురుపల్లి రిపోర్టర్
ఏ.ఎస్.ఎన్. రాజు
Breaking News

Subscribe our Newsletter