జలజీవన్ మిషన్ 2.0 (అమరజీవి జలధార)లో భాగంగా మెరకముడిదాం మండలంలో తాగునీటి వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గరుగుబిల్లి గ్రామంలో రూ.4.56 లక్షలతో మంజూరైన బోర్‌వెల్ నిర్మాణానికి చీపురుపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు సోమవారం శంకుస్థాపన చేశారు. మెరకముడిదాం మండలంలోని 22 రెవెన్యూ గ్రామాలు, 45 ఆవాస గ్రామాలకు తాగునీటి వసతుల కోసం మొత్తం రూ.1.56 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అలాగే చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 74 రెవెన్యూ గ్రామాలు, 134 ఆవాస గ్రామాలకు సంబంధించి జలజీవన్ మిషన్ 2.0 కింద రూ.4.85 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఈ పనులను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
క్రైమ్ ఎనాలసిస్ చీపురుపల్లి రిపోర్టర్ ఎస్.ఏ.ఎన్. రాజు