* ఏలూరు నియోజకవర్గంలో 100% స్ట్రైక్ రేట్ లక్ష్యం..
* స్థానిక సంస్థల్లో పోటీ చేసే ప్రతి స్థానంలోనూ కూటమి విజయం సాధించాలి..
* స్థానిక ఎన్నికల కోఆర్డినేటర్ బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపు..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరులో కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రతి స్థానంలో విజయం సాధించి 100% స్ట్రైక్ రేటును నమోదు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అమలాపురం మరియు ఏలూరు పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేటర్, రాష్ట్ర ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పిలుపునిచ్చారు.. ఆదివారం స్థానిక ఏలూరు జనసేన కార్యాలయంలో ఏలూరు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులు, మూడు పార్టీల సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు..
కూటమి తరఫున పోటీ చేయబోయే ప్రతి అభ్యర్థి గెలుపే లక్ష్యం:-
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలుపే ఏకైక లక్ష్యంగా, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశంలో బొలిశెట్టి శ్రీనివాస్ వివరించారు.. కూటమిలో జనసేన, టిడిపి, బీజేపీ పార్టీల నుండి ఏ పార్టీకి చెందిన అభ్యర్థి, పోటీ చేసినప్పటికీ, మిగిలిన రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు, పూర్తి సహకారం అందించి, అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.. కూటమిలో మూడు పార్టీల మధ్య ఐక్యత, పరస్పర సహకారంతో క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు సూచించారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను, క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని బొలిశెట్టి శ్రీనివాస్ గారు వివరించారు.. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పనితీరు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి డివిజన్, కూటమి నాయకులు ప్రజలకు వివరించేలా కార్యాచరణ రూపొందించాలని ఆయన అన్నారు..
గ్రామస్థాయి నుంచి సమన్వయం:-
స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి నుంచి మండల మున్సిపాలిటీ కార్పొరేషన్ స్థాయి వరకు, పక్క ప్రణాళిక, సమన్వయంతో కూడిన ప్రణాళికను సిద్ధం చేయాలని బొలిశెట్టి శ్రీనివాసు గారు సూచించారు.. 3 పార్టీల స్థానిక నాయకులు, కార్యకర్తల మధ్య నిరంతరం సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.. క్షేత్ర స్థాయిలో ఎదురయ్య సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, మూడు పార్టీల నాయకులు కలిసి పరిష్కరించుకునేలా సమన్వయ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.. ఎన్నికలకు ముందుగానే క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి, బలమైన అభ్యర్థుల ఎంపిక తో పాటు, ప్రచార వ్యూహాలను రూపొందించి, పక్క ప్రణాళికలో, ఎన్నికల బరిలోకి దిగాలని బొలిశెట్టి శ్రీనివాస్ గారు వివరించారు.. కూటమి పార్టీల మధ్య సమన్వయం, అభ్యర్థుల బలం, స్థానిక పరిస్థితులు, ప్రజల మద్దతును పరిగణలోకి తీసుకుని, ఎన్నికల వ్యూహాన్ని రూపొందించాలని ఆయన సూచించారు..
ఏలూరు నగర మేయర్ పీఠం జనసేనకు ఇవ్వాలని అధిష్ఠానానికి అభ్యర్థన..
రానున్న ఏలూరు నగర పాలకసంస్థ ఎన్నికల్లో మేయర్ పదవీ జనసేన పార్టీకి ఇవ్వాలని జనసేన పార్టీ అధిష్టానానికి తమ అభ్యర్థనను తెలియజేసినట్లు బొలిశెట్టి శ్రీనివాస్ గారు తెలిపారు.. జనసైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులు కూడా ఇదే కోరుతున్నారు.. పార్టీ అధిష్టానం కోసం నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని తెలిపారు.. ఏలూరులో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా ఎలాంటి వర్గ భేదాలు లేకుండా ఐకమత్యంతో పనిచేసి 100% స్ట్రైక్ రేటు విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు..
అన్ని స్థానాల్లో విజయం సాధించాలి - రెడ్డి అప్పలనాయుడు:-
కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఏలూరు పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయకర్త రెడ్డి అప్పలనాయుడు అన్నారు.. ఏలూరు నియోజకవర్గం తో పాటు ఏలూరు జిల్లాలో కూటమి తరపున పోటీ చేసే ప్రతి అభ్యర్థి విజయమే లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, సమిష్టిగా పనిచేసి అన్ని స్థానాల్లోనూ విజయం సాధించాలని రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు.. తద్వారా ఏలూరు జిల్లాలోనే కూటమి ప్రభుత్వం 100% స్ట్రైక్ రేటు నమోదు చేసే దిశగా ముందుకు సాగుతుందని అన్నారు.. మరోపక్క వైసీపీ నాయకులు కుట్రలకు తెరతీశారంటూ విమర్శలు గుప్పించిన ఆయన వాటన్నింటిని తిప్పికొట్టేందుకు తాము కూడా అంతే సమర్థవంతంగా ముందుకెళ్తామంటూ వ్యాఖ్యానించారు.. ప్రతి నియోజకవర్గం లో పరిస్థితులను పరిశీలించి, స్థానిక సంస్థల ఎన్నికలకు సిధ్ధం అవుతున్నామన్నారు..
ఈ కార్యక్రమం లో ఏలూరు పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తలు నారా శేష, కస్తూరి సాయి తేజస్విని, సపోర్టింగ్ టీమ్ సభ్యులు తిరుపతి వాసు, వలవల తాతాజీ , జె. బిపిన్ కుమార్ (జనసేన రవి), వి. వెంకటేశ్వర్ రావు (నానాజీ), పాశం నాగబాబు, అడపా నాగబాబు, సూరత్తుల రాఘవ అయ్యప్ప, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి, శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రోగ్రాం కమిటీ అధ్యక్షులు రెడ్డి గౌరీ శంకర్, భారీ సంఖ్యలో జిల్లా నాయకులు, నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.