చీపురుపల్లి, అక్టోబర్ 2:
ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం డిమాండ్స్ డే (కోరికల దినోత్సవం) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చీపురుపల్లి యూనిట్ ప్రతినిధులు తెలిపారు.ఈ సమావేశానికి చీపురుపల్లి, గుర్ల, గరివిడి, మెరకముడిదాం మండలాలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పాత్రికేయుల సమస్యలు, సంక్షేమం, జర్నలిస్టుల ఐక్యతపై సుదీర్ఘంగా చర్చించారు. అర్హులైన పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, వైద్య, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.అనంతరం పాత్రికేయులంతా కలిసి చీపురుపల్లి కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి, తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
గాంధీ చూపిన సత్య, అహింసా మార్గంలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని, త్వరితగతిన పరిష్కరించాలని పాత్రికేయుల నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల సీనియర్, జూనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు