ఘనంగా 43వ అంతర్జాతీయ ఎయిడ్స్ దీప స్మృత్యాంజలి ర్యాలీ

ఘనంగా 43వ అంతర్జాతీయ ఎయిడ్స్ దీప స్మృత్యాంజలి ర్యాలీ

18/May/2026 07:52    Share:   

                                                                
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
 
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచి వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ  కృషియాలని జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టీబి ఆఫీసర్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య అధికారినీ వారి కార్యాలయంలో 43వ అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏలూరు ప్రధాన రహదారిలో క్యాండిల్స్ పట్టుకుని, మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధితో మనోవేదన గురై మనస్థాపానికి గురైన వారికి అండగా మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ డిఎల్ఏ డివో డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలుసో తెలియకో ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన వారి పట్ల సంఘీభావంతో వివక్ష లేకుండా వారిపట్ల మెలిగి మనతో కలుపుకోని, వ్యాధిని నిర్మూలించాలి తప్ప మనిషిని కాదు అనే విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం సిబ్బంది ఎయిడ్స్ రిబ్బన్ ను అందంగా అలంకరించిన సిబ్బంది రిబ్బన్ చుట్టూరు క్యాండిల్ లను వేలుగించి ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ఆఫీస్ అని విభాగాల సిబ్బంది,  ఎన్జీవోలు, ఎయిడ్స్ డిపార్ట్మెంట్ కి చెందిన పార్ట్నర్ ఎన్జీవోలు,  మెడికల్ కాలేజ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter