పెదపాడు దళితపేటలో సమస్యలు పరిష్కరించాలి, ప్రజా సంఘాలు..

పెదపాడు దళితపేటలో సమస్యలు పరిష్కరించాలి, ప్రజా సంఘాలు..

22/July/2026 19:53    Share:   


సామాజిక శంఖారావం  రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై వివక్షతకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు సర్వేలకు పిలుపునిచ్చాయి అందులో భాగంగా పెదపాడు గ్రామంలో సిఐటియు రాష్ట్ర నాయకులు జి కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఆర్ రాము, రైతు సంఘం అధ్యక్షులు కర్రి అప్పారావు పర్యటన చేయడం జరిగింది గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలపై దళితులు వివరించడం జరిగింది గ్రామంలో ఉపాధి హామీ పనులు , రోడ్లు, సైడ్ కాలవలు సక్రమంగా లేవని కొంతమందికి ఉపాధి హామీ పనులు కల్పించలేదని పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామంలో సీలింగ్ భూములు ఉన్నా దళితులకు ఇవ్వడం లేదని, డ్రైనేజీ నీరు దళిత పేటలోకి వస్తుందని వాపోయారు ఈ సమస్యలు పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సముద్రాలూ, చిన్న, నాగేష్ తదితరులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter