యలమంచిలి బార్ అసోసియేషన్.విజయవాడ ఘటనపై ఖండన..

యలమంచిలి బార్ అసోసియేషన్.విజయవాడ ఘటనపై ఖండన..

06/October/2026 07:20    Share:   

విజయవాడ బార్ అసోసియేషన్ సీనియర్ అడ్వకేట్‌పై పోలీసులు రౌడీ షీట్ తెరవడాన్ని తీవ్రంగా ఖండించారు.
అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ డిమాండ్

యలమంచిలి
న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సోమవారం యలమంచిలి లో న్యాయవాదుల బార్ అసోసియేషన్ సభ్యులు విధులను బహిష్కరించారు. విజయవాడ బార్ అసోసియేషన్ సీనియర్ అడ్వకేట్‌పై పోలీసులు రౌడీ షీట్ తెరవడాన్ని ఖండిస్తూ ఈ నిరసన తెలియజేస్తున్నామన్నారు.
విజయవాడలో న్యాయవాదులు శాంతియుతంగా నిర్వహించిన ర్యాలీ సందర్భంగా పోలీసులు బార్ అసోసియేషన్ సభ్యుల పట్ల వ్యవహరించిన దురుసు వైఖరిని ఖండిస్తున్నాం అన్నారు.యలమంచిలి బార్ అసోసియేషన్
ఆంధ్రప్రదేశ్‌లో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ (న్యాయవాదుల రక్షణ చట్టం)ను తక్షణమే రూపొందించి, అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ విషయంలో గౌరవనీయ న్యాయమూర్తులు తమకు సహకరించి న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోర్టు బయట న్యాయవాదులు నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యులతో పాటు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter