ఏఎంఆర్ అక్రమ వసూళ్లపై సమగ్ర దర్యాప్తు చేయాలి సీపీఎం..

ఏఎంఆర్ అక్రమ వసూళ్లపై సమగ్ర దర్యాప్తు చేయాలి సీపీఎం..

05/October/2026 18:48    Share:   

క్వారీల నుంచి టన్నుకు రూ.170 వసూలు చేస్తున్నారంటూ సీపీఎం ఆరోపణలు
జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు
అనకాపల్లి, అక్టోబర్ 5:

అనకాపల్లి జిల్లా, ముఖ్యంగా అనకాపల్లి మండలంలో అక్రమ మైనింగ్, మెటీరియల్ రవాణాను అడ్డుకోవాల్సిన ఏఎంఆర్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా టోల్ గేట్లను ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతోందని సీపీఎం అనకాపల్లి మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అక్రమంగా మైనింగ్ చేస్తున్న క్వారీల నుంచి తరలించే మెటీరియల్‌కు టన్నుకు రూ.170 చొప్పున వసూలు చేస్తున్నారని, ట్రాక్టర్లు, లారీలను బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రోజుకు కోట్ల రూపాయల మేర వసూళ్లు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు.
అనకాపల్లి మండలంలో 130కు పైగా క్వారీలు ఉండగా, సుమారు 70 క్వారీల్లో మైనింగ్ జరుగుతోందని శ్రీరామ్ తెలిపారు. వాటిలో కేవలం 15 నుంచి 20 క్వారీలకు మాత్రమే అన్ని అనుమతులు ఉన్నాయని, అనుమతులకు మించి మైనింగ్ చేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయని ఆరోపించారు. సరైన రవాణా అనుమతులు లేకుండానే ఇతర ప్రాంతాలకు మెటీరియల్ తరలిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో ఏఎంఆర్ సంస్థకు స్పష్టమైన నియంత్రణలు ఉన్నాయని, స్లాబ్ విధానం కింద రవాణా అనుమతులు జారీ చేయడం, డబ్బులు వసూలు చేయడం, అక్రమ ప్రాంతాల నుంచి తరలించే మెటీరియల్‌కు పర్మిట్లు ఇవ్వడం, ఇతర లీజుల నుంచి వచ్చే మెటీరియల్‌కు పాస్‌లు జారీ చేసి నగదు వసూలు చేయడం వంటి చర్యలు చేయరాదని ఒప్పందంలోని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter