జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్.బి డీఎస్పీ వి.బాబ్జీరావు
05/October/2026 12:45
Share:
అనకాపల్లి, అక్టోబర్ 5:
1995 ఎస్సై బ్యాచ్‌కు చెందిన వి.బాబ్జీరావు గారు ఇటీవల సీఐడీ విభాగంలో సీఐగా సేవలందిస్తూ డీఎస్పీగా పదోన్నతి పొందారు. అనంతరం అనకాపల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్ (ఎస్.బి) డీఎస్పీగా ప్రభుత్వం నుండి పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్న ఆయన, తన బాధ్యతల స్వీకరణ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారికి ఆయన హరిత సంకేతంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ వి.బాబ్జీరావు గారు గతంలో అనకాపల్లి ట్రాఫిక్ సీఐగా విశేష సేవలందించి ప్రజలు, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో అనుభవజ్ఞుడైన ఆయన ఎస్.బి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టడం పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు మాట్లాడుతూ "జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు స్పెషల్ బ్రాంచ్ (ఎస్.బి) విభాగం గుండెకాయ వంటిది. సమస్యాత్మక ప్రాంతాలు, సంఘటనలపై ముందస్తు సమాచారాన్ని (ఇంటెలిజెన్స్) ఎప్పటికప్పుడు సేకరించి అప్రమత్తం చేయడంలో ఎస్.బి కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక సాంకేతికతను జోడించి, సమాచార నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేస్తూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి." నూతన బాధ్యతలు చేపట్టిన వి.బాబ్జీరావు గారు తన అనుభవంతో సమర్థవంతంగా పనిచేసి జిల్లా పోలీసు శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, స్పెషల్ బ్రాంచ్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.