ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!!యలమంచిలి 17వ, 18వ వార్డుల్లో అవగాహన కార్యక్రమం
04/April/2026 06:17
Share:
యలమంచిలి వేసవికాలంలో రాత్రిపూట గృహ యజమానులు జాగ్రత్తగా ఉండాలి..!! క్రైమ్ అనాలసిస్ టీవీఎస్ ప్రకాష్, యలమంచిలి : యలమంచిలి పట్టణంలోని 17వ, 18వ వార్డుల్లో పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ ఎస్సై కె. సావిత్రి ఆధ్వర్యంలో నిర్వహించగా, మాజీ కౌన్సిలర్ పడాల శ్రీను, కావ్య మరియు రాంనగర్ ప్రాంత ప్రజలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్సై సావిత్రి మాట్లాడుతూ, వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ముఖ్యంగా రాత్రిపూట గృహ యజమానులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.దొంగతనాల నివారణ కోసం యలమంచిలి పట్టణ పోలీసులు పలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఆటో రిక్షాలపై ప్లెక్సీలు ఏర్పాటు చేసి, మైక్‌ల ద్వారా ప్రజలకు భద్రతా సూచనలు తెలియజేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే వాహన తనిఖీలు, గ్రామ సందర్శనల సమయంలో పాంప్లెట్లు పంపిణీ చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు.రద్దీ ప్రదేశాల్లో పాంప్లెట్లు అతికించడం ద్వారా కూడా భద్రతపై చైతన్యం కల్పిస్తున్నారు. ఈ చర్యల ద్వారా ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పోలీసులు పేర్కొన్నారు.ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు భరోసా ఇచ్చారు.