ఎస్ ఈ జెడ్, ఫార్మా, ఇతర పరిశ్రమల్లో కార్మికులకు 20 శాతం బోనస్ ఇవ్వాలి - సిఐటియు
05/October/2026 12:18
Share:
అచ్యుతాపురం సెజ్ , ఫార్మా, ఇతర పరిశ్రమల యాజమాన్యాలు తక్షణమే ఈ నెల జీతాలతో కలిపి బోనస్ ఇవ్వాలని అచ్యుతాపురం జంక్షన్లో నిరసన కార్యక్రమం జరిగింది .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము ,మండల కన్వీనర్ కె సోము నాయుడు మాట్లాడుతూ బోనస్ చట్టం 1965 ప్రకారం లాభాల్లో ఉన్న ప్రతి పరిశ్రమ 8.33% నుండి 20% వరకు బోనస్ చెల్లించాలి. బోనస్ అనేది యాజమాన్యాల బిక్ష కాదు కార్మికుల హక్కు కార్మికులకు బకాయి పడ్డ వేతనం అని దీనిని అన్ని కేటగిరిలో పర్మినెంట్, కాంటాక్ట్, డైలీ వేస్ ,ఇతర అన్ని కేటగిరీల కార్మికులకు వర్తిస్తుందని లాభనష్టాలతో సంబంధం లేకుండా ఈనెల వేతనంతో పాటు అన్ని పరిశ్రమలు కార్మికులకు వెంటనే బోనస్ 20% చెల్లించాలని ,ఎస్ ఈ జెడ్, ఫార్మా అన్ని పరిశ్రమ యాజమాన్యాలపై కార్మికులందరూ బోనస్ ఇవ్వాలని యాజమాన్యాలపై ఒత్తిడి తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సత్తిబాబు, బయ్యవరపు సన్యాసిరావు, రాము, అప్పన్న, బిస్వాల్ తదితరులు పాల్గొన్నారు.