కొక్కిరాపల్లి హాస్టల్‌లో 'ఆన్సైట్ కంపోస్టింగ్'పై అవగాహన సదస్సు
13/April/2026 13:27
Share:
యలమంచిలి స్థానిక కొక్కిరాపల్లి గర్ల్స్ హాస్టల్‌లో అవగాహన కార్యక్రమం క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి : ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు పర్యవేక్షణలో విద్యార్థులకు ఇంటి వద్ద తడి చెత్త, పొడి చెత్త వేరు చేయు విధానం, అలాగే ప్లాస్టిక్ నిషేధంపై వివరించారు.అదేవిధంగా చెత్తను వేరు చేసిన తర్వాత వాటి నిర్వహణ విధానం, హాస్టల్ ప్రాంగణంలో ఆన్సైట్ కంపోస్టింగ్ ప్రాముఖ్యతపై కూడా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సానిటరీ సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.