క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ (స్పెషల్ రిపోర్టర్ ) :
పురుషోత్తపురం గ్రామంలో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం) ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మౌన పోరాటం నిర్వహించారు. కొలుకులూరి విజయరామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మౌన నిరసనలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రజా సమస్యలు, స్థానిక పరిస్థితులపై తమ నిరసనను తెలియజేస్తూ నాయకులు, కార్యకర్తలు మౌనంగా నిరసన చేపట్టారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా టీడీపీ వైస్ ప్రెసిడెంట్ రాజా వెంకట రమణ రావు, యూనిట్ ఇన్‌చార్జి ఊడి రామకృష్ణ, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎడ్ల చిన్నబాబు, యూనిట్ ఇన్‌చార్జి రాజాన వెంకు నాయుడు, మండల వైస్ కార్యదర్శి కాళ్ల సత్యనారాయణ, గ్రామ టీడీపీ అధ్యక్షుడు రెడ్డి నానాజీ తదితరులు పాల్గొన్నారు.అలాగే ముని,నాని,సూరిబాబు,కార్తీక్,టివియస్ ప్రకాష్,లోవ తో పాటు పలువురు మహిళలు,టీడీపీ నాయకులు,కార్యకర్తలు మౌన పోరాటంలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.ఆర్బీకే ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఈ మౌన పోరాటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.