పురుపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు అన్నారు. చీపురుపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన భారీ చేరికల కార్యక్రమంలో దేవరపొదిలం గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు, దేవాడ గ్రామానికి చెందిన మరో 10 కుటుంబాలు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నూతనంగా చేరిన కుటుంబాలు తెలిపారు. ఈ సందర్భంగా విసినిగిరి శ్రీనివాసరావు వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇటీవల జరిగిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా విజయం సాధించిన నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జనసేన తరఫున SMC ఎన్నికల్లో విజయం సాధించిన వారందరికీ త్వరలో ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ రోజురోజుకూ బలోపేతమవుతోందని, ప్రజల్లో పార్టీపై విశ్వాసం మరింత పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ చీపురుపల్లి రిపోర్టర్ ఎస్.ఏ.ఎన్. రాజు