రచయిత బెహరా వెంకట సుబ్బారావు సాహిత్య సేవలు అభినందనీయం: ఎంపీ కలిశెట్టి

రచయిత బెహరా వెంకట సుబ్బారావు సాహిత్య సేవలు అభినందనీయం: ఎంపీ కలిశెట్టి

03/October/2026 20:08    Share:   

విజయనగరం, అక్టోబర్ 3:

సాహిత్యం సమాజానికి దర్పణమని, రచయితలు తమ రచనల ద్వారా సమాజంలోని జీవన విధానాలను, మానవ విలువలను ప్రతిబింబిస్తారని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. వృత్తిరీత్యా పోస్టుమ్యాన్‌గా పనిచేస్తూనే సాహిత్యంపై మక్కువతో విశేష రచనా కృషి చేసిన ప్రముఖ రచయిత, దివంగత బెహరా వెంకట సుబ్బారావు సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
విజయనగరంలోని జీఎస్ఆర్ ఇంటర్నేషనల్‌లో తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో, సముద్రాల గురు ప్రసాద్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన “మధ్యతరగతి మందహాసం” ఇంగ్లీష్ అనువాద పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బెహరా వెంకట సుబ్బారావు రచించిన పుస్తకానికి ఆంగ్ల అనువాదంగా రూపొందించిన “The Quiet Weight of Life” గ్రంథాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతృభాషలో వెలువడిన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించడం ద్వారా రచయితల ఆలోచనలు, అనుభవాలు మరింత విస్తృత పాఠకలోకానికి చేరుతాయని అన్నారు. బెహరా వెంకట సుబ్బారావు రచనలను ఆంగ్లంలోకి అనువదించి పాఠకులకు పరిచయం చేస్తున్న ఆయన కుమారుడు బెహరా సత్యనారాయణమూర్తిని ప్రత్యేకంగా అభినందించారు. సాహిత్యం భాషా సరిహద్దులను అధిగమించి మానవ అనుభవాలను, జీవన విలువలను అందరికీ చేరవేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు, ప్రాజెక్ట్ చైర్‌పర్సన్ గురాన అయ్యలు, విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాపుగంటి శ్రీనివాస్, సాహిత్యాభిమానులు, ప్రముఖులు పాల్గొన్నారు.

క్రైమ్ అనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు
Breaking News

Subscribe our Newsletter