చీపురుపల్లి గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.4.52 కోట్లు..

చీపురుపల్లి గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.4.52 కోట్లు..

03/October/2026 20:06    Share:   

పలు రహదారి పనులకు ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు శంకుస్థాపన
చీపురుపల్లి, అక్టోబర్ 3:

గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ.4.52 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు చీపురుపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కిమిడి కళావెంకట రావు శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈ పనులను చేపట్టనున్నారు.
పత్తికాయవలస నుంచి మొగదిపేట వరకు రూ.105 లక్షలు, సంకుపాలెం–చీపురుపల్లి–లావేరు రహదారికి రూ.145 లక్షలు, కళిశెట్టిబడి రోడ్డు నుంచి చిలకరాళ్లబడి మీదుగా పెదనడిపల్లి వరకు బీటీ రోడ్డుకు రూ.202 లక్షలు కేటాయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావెంకట రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పల్లె రహదారుల అభివృద్ధితో గ్రామాల మధ్య అనుసంధానం మెరుగుపడి ప్రజలకు రవాణా సౌకర్యం మరింత సులభతరం అవుతుందని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

క్రైమ్ ఎనాలసిస్ చీపురుపల్లి రిపోర్టర్
ఎస్. ఏ. ఎన్. రాజు
Breaking News

Subscribe our Newsletter