చీపురుపల్లిలో 400 మీటర్ల ట్రాక్ ఏర్పాటు కోసం కృషి

చీపురుపల్లిలో 400 మీటర్ల ట్రాక్ ఏర్పాటు కోసం కృషి

01/October/2026 19:35    Share:   

చీపురుపల్లి అక్టోబర్ 1:

చీపురుపల్లి నియోజకవర్గంలో అగ్నివీర్, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ తదితర రక్షణ రంగ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెరుగైన శిక్షణ సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు తెలిపారు.

చీపురుపల్లి–గరివిడి ప్రధాన రహదారిలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో రక్షణ రంగ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రాక్టీస్ చేస్తున్న ప్రాంతాన్ని ఆయన స్వయంగా సందర్శించారు. ప్రస్తుతం సరైన 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ లేకపోవడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన విద్యార్థుల నుంచి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ, 400 మీటర్ల ట్రాక్ అవసరాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి, చీపురుపల్లిలో ట్రాక్ ఏర్పాటు చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రక్షణ రంగంలో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో కష్టపడుతున్న యువతకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter