మొలకలపల్లి మైహోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం

మొలకలపల్లి మైహోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం

20/February/2026 06:30    Share:   

యలమంచిలి/ మండలంలోని ములకలాపల్లి గ్రామంలో గల మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సిమెంట్ ఫ్యాక్టరీ) సి.ఎస్.ఆర్ నిధుల నుండి పులపర్తి గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్ధిని విద్యార్ధులకు ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఫ్యాక్టరీ యూనిట్ హెడ్ బి.రామస్వామి అన్నారు. ఈ మెడికల్ క్యాంప్ లో లక్కవరం, పులపర్తి, గూండ్రుబిల్లి, కృష్ణాపురం స్కూల్ విద్యార్ధిని విద్యార్దులు మొత్తం 157 మందికి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి. సాంభమూర్తి, డాక్టర్ ప్రియ, డాక్టర్ అవినాష్, డాక్టర్ సోని, డాక్టర్ దనుంజయ్, ఫ్యాక్టరీ యూనిట్ హెడ్ బి.రామస్వామి, సీనియర్ డి.జి.ఎమ్ (పి.అండ్.ఎ) ఎల్. శ్రీనివాసరావు, సి.ఎస్.ఓ డి. వెంకటరావు, పాఠశాల ఉపాద్యాయులు పాల్గొన్నారు.
ఓఎన్ఓఎస్ కు హాజరైన డిగ్రీ కళాశాల విద్యార్థులు
ఉన్నమాట/యలమంచిలి/ స్థానిక శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బి.ఎస్. సి కంప్యూటర్స్, బీకాం కంప్యూటర్స్ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నంలోని ప్రసిద్ధ ప్రదేశాలను ప్రఖ్యాత సంస్థలను సందర్శించారు. దానిలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్, కంప్యూటర్స్, కామర్స్ విభాగాలను దర్శించారు. అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో జరుగుతున్న వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు, సుమారు వందమందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగాధిపతి డాక్టర్ వి చిట్టిబాబు, ఫిజిక్స్ విభాగాధిపతి కె.వెంకన్నలతో పాటు ఆయా విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. కళాశాల నుంచి రెండు బస్సులలో బయలుదేరిన విద్యార్థుల ఈ క్షేత్ర పర్యటనను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్ ప్రారంభించారు.
Breaking News

Subscribe our Newsletter